Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెరిసిన శ్రీకాంత్, ప్రణరు
- ఇండోనేషియా మాస్టర్స్ ఓపెన్
జకర్తా : భారత షట్లర్లు ఫామ్‌లోకి వచ్చారు. ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీలో మన బ్యాడ్మింటన్ క్రీడాకారులు స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశారు. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ పి.వి సింధు క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. స్పెయిన్ షట్లర్ క్లారా అజుర్మెండి 17-21, 21-7, 21-12తో మూడు గేముల మ్యాచ్‌లో గెలుపొందింది. తొలి గేమ్‌లో 17-21తో ఓటమి చెందిన సింధు.. తర్వాతి వరుస గేముల్లో దుమ్మురేపింది. 21-7, 21-12తో ఏకపక్ష విజయం నమోదు చేసింది. పురుషుల సింగిల్స్‌లో మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ 13-21, 21-18, 21-15తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేషియా)పై విజయం సాధించాడు. శ్రీకాంత్ సైతం తొలి గేమ్‌లో వెనుకంజ వేసినా.. తర్వాత వరుస గేముల్లో పుంజుకున్నాడు. మరో ఆటగాడు హెచ్.ఎస్ ప్రణరు 14-21, 21-19, 21-16తో రెండో సీడ్ విక్టర్ అక్సెల్సెన్కు షాక్ ఇచ్చాడు. మూడు గేముల మ్యాచ్‌లో టాప్ షట్లర్‌పై విజయం సాధించాడు. యువ ఆటగాడు లక్ష్య సేన్ ప్రీ క్వార్టర్స్‌లో నిరాశపరిచాడు. 13-21, 17-21తో వరల్డ్ నం.1 కెంటో మోమోటపై విజయం సాధించాడు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి 18-21, 12-21తో మూడో సీడ్ థారులాండ్ జోడీ చేతిలో ఓటమి చెందారు.