Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండియన్ సూపర్‌లీగ్
గోవా: ఇండియన్ సూపర్‌లీగ్ (ఐఎస్ఎల్) 2021-22లో ఏటికే మోహన్ బగాన్ జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన ప్రారంభమ్యాచ్‌లో ఏటికే మోహన్ బగాన్ జట్టు తొలి అర్ధభాగం పూర్తయ్యేసరికే 3-1 గోల్స్ ఆధిక్యతలో నిలిచింది. మ్యాచ్ ప్రారంభమైన 2వ నిమిషంలోనే హుగో బుమస్ గోల్ చేయడంతో ఏటికే 1-0 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత కేరళ తరఫున 24వ ని.లో సహల్ అబ్దుల్ గోల్ కొట్టడంతో 1-1తో సమమైంది. ఆ తర్వాత ఏటికే తరఫున రారు కృష్ణ(27) పెనాల్టీని గోల్‌గా మలచగా.. మరో గోల్‌ను బూమస్ 39వ నిమిషంలో కొట్టాడు. రెండో అర్ధభాగంలోనూ ఏటికే మరో గోల్ చేయడంతో 4-1 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది.