Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సెంచూరియన్: దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అన్ని ఫార్మాట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ట్విట్టర్ వేదికగా రిటైర్మెంట్ ప్రకటనను శుక్రవారం వెల్లడించాడు. ప్రస్తుతం తనలో క్రికెట్ ఆడగల సత్తా లేదని అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు 37ఏళ్ల డివిలియర్స్ కామెంట్ చేశాడు. తన కెరీర్లో అద్భుతమైన జర్నీ సాగిందని, అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. 2004లో ఏబీ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. దక్షిణాఫ్రికాకు అతను 114టెస్టులు, 228వన్డేలు, 78టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి అతను 20014 రన్స్ చేశాడు. 2018లోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న డివిలియర్స్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)లో ఆర్సీబీకి ఆడుతున్నాడు. తాజా రిటైర్మెంట్తో ఏబీ ఇక ఆర్సీబీకి కూడా దూరంకానున్నాడు. 2021 ఐపీఎల్‌లోనూ ఆర్సీబీ తరపున డివిలియర్స్ ఆడాడు.
కోహ్లి స్పందన..
క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించడంతో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. 'మన తరంలో ఉత్తమ ఆటగాడు, నేను కలిసిన వారిలో అందరికన్నా స్ఫూర్తిమంతమైన వ్యక్తి. నువ్వు ఇప్పటి వరకూ సాధించిన విజయాలు, ఆర్సీబీకి నువ్వు చేసిన సేవ చూసి నువ్వు గర్వించాలి బ్రదర్. మన బంధం ఆటను ఎప్పుడో దాటేసింది. ఎప్పటికీ అలాగే ఉంటుంది కూడా' కోహ్లి ట్వీట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం రికార్డు కూడా వీరి పేరిటే ఉంది. 2016లో గుజరాత్ లయన్స్‌పై రెండో వికెట్‌కు 229 పరుగులు చేసిన వీరిద్దరు.. 2015లో ముంబై ఇండియన్స్‌పై 215 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.