Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీ
బాలి: ఇండోనేషియా మాస్టర్స్ టెన్నిస్ టోర్నీ సెమీఫైనల్లో కిదాంబి శ్రీకాంత్, పివి సింధు ప్రవేశించారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్ పోటీలో కిదాంబి శ్రీకాంత్ 21-7, 21-18 తేడాతో సహచర షట్లర్ హెచ్ఎస్ ప్రణరు రారును వరుససెట్లలో చిత్తుచేశారు. ఈ మ్యాచ్‌ను శ్రీకాంత్ కేవలం 40 నిమిషాల్లోనే ముగించాడు. తొలి సెట్‌ను సునాయాసంగా గెలిచిన శ్రీకాంత్.. రెండో సెట్లో ఓ దశలో 10-7 ఆధిక్యతలో ఉండగా ప్రత్యర్ధి షట్లర్ పుంజుకోవడంతో ఆ సెట్ పోటాపోటీగా సాగింది. చివరి ఆ సెట్‌ను 21-18తరరరో కైవసం చేసుకొని శ్రీకాంత్ మ్యాచ్‌ను ముగించి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో పివి సింధు 21-13, 21-10 పాయింట్ల తేడాతో టర్కీకి చెందిన నెస్లిహాన్ను చిత్తుచేసింది. ఈ మ్యాచ్‌ను సింధు కేవలం 35 నిమిషాల్లోను ముగించింది. సెమీస్‌లో సింధు.. టాప్‌సీడ్ యమగుచి, 5వ సీడ్ ఛోఛువాంగ్ మ్యాచ్ విజేతతో తలపడనుంది.