Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపు
- టీ20 సిరీస్ 2-0తో కైవసం
రాంచీ: మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన టీ20లోనూ టీమిండియా 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చిత్తుచేసింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేయగా.. టీమిండియా 17.2 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి విజయం సాధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ 31, డారిల్ మిచెల్ 31 పరుగులతో రాణించి శుభారంభం అందించారు. ఆ తర్వాత మార్క్ చాప్మన్(21) కూడా ధాటిగా ఆడారు. దీంతో న్యూజిలాండ్ ఓ దశలో 15 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసి భారీస్కోర్‌పై కన్నేసింది. ఆ తర్వాత చివరి 5 ఓవర్లలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో, నీషమ్(2), షెఫర్ట్(13) వెంట వెంటనే ఔటవ్వడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులే చేయగల్గింది. ఫిలిప్స్(34) అత్యధిక పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్‌కు రెండు, భువనేశ్వర్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్, అశ్విన్‌కు తలా ఒక వికెట్ లభించాయి. లక్ష్య ఛేదనలో భారత్‌కు రోహిత్-కేఎల్ రాహుల్ కలిసి తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. కేఎల్ రాహుల్ 40 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తి చేశాడు. మిల్నే వేసిన 10.2వ బంతిని భారీ సిక్సర్‌గా మలిచి టీ20 కెరీర్లో 16వ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 117 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాహుల్(65), రోహిత్(55) అర్ధసెంచరీలు పూర్తయిన తర్వాత ఔట్ కాగా.. సూర్యకుమార్ యాదవ్(1) మరోసారి నిరాశపరిచాడు. నీషమ్ వేసిన ఓవర్లో రిషబ్ పంత్ వరుసగా రెండు సిక్సర్లు బాది మ్యాచ్‌ను ముగించాడు. దీంతో భారత్ 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.
స్కోర్‌బోర్డు..
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి)పంత్ (బి)చాహర్ 31, మిఛెల్ (సి)సూర్యకుమార్ (బి)హర్షల్ 31, చాప్మన్ (సి)కేఎల్ రాహుల్ (బి)అక్షర్ 21, ఫిలిప్స్ (సి సబ్)రుతురాజ్ (బి)హర్షల్ 34, షెఫెర్ట్ (సి)భువనేశ్వర్ (బి)అశ్విన్ 13, నీషమ్ (బి)పంత్ (బి)భువనేశ్వర్ 3, సాంట్నర్ (నాటౌట్) 8, మిల్నే (నాటౌట్) 5, అదనం 7. (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 153 పరుగులు.
వికెట్ల పతనం: 1/48, 2/79, 3/90, 4/125, 5/134, 6/140
బౌలింగ్: భువనేశ్వర్ 4-0-39-1, చాహర్ 4-0-42-1, అక్షర్ 4-0-26-1, అశ్విన్ 4-0-19-1, హర్షల్ 4-0-25-2.
భారత్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి)ఫిలిప్స్ (బి)సౌథీ 65, రోహిత్ శర్మ (సి)గప్టిల్ (బి)సౌథీ 55, వెంకటేశ్ అయ్యర్ (నాటౌట్) 12, సూర్యకుమార్ (బి)సౌథీ 1, పంత్ (నాటౌట్) 12, అదనం 10. (17.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) 155పరుగులు.
వికెట్ల పతనం: 1/117, 2/135, 3/137
బౌలింగ్: సౌథీ 4-0-16-3, బౌల్ట్ 4-0-36-0, సాంట్నర్ 4-0-33-0, మిల్నే 3-0-39-0, సోథీ 2-0-12-0, నీషమ్ 0.2-0-12-0.