Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్‌లో వరుస గేముల్లో పరాజయం
- ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీ
జకర్తా (ఇండోనేషియా) : రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి సింధు పోరాటానికి తెరపడింది. ఒలింపిక్స్ అనంతరం తొలి టైటిల్‌పై కన్నేసిన తెలుగు తేజం జకర్తాలో వరుస విజయాలతో జోరు మీద కనిపించింది. ఇక్కడ టైటిల్ విజయం ఖాయమే అనిపించింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో పి.వి సింధు 13-21, 9-21తో జపాన్ స్టార్ షట్లర్, టాప్ సీడ్ అకానె యమగూచి చేతిలో పరాజయం పాలైంది. 32 నిమిషాల్లో ముగిసిన సెమీ సమరంలో ప్రియ ప్రత్యర్థి అకానె యమగూచి చేతిలో భంగపాటుకు గురైంది. తొలి గేమ్‌లో ఆరంభంలో సింధు మెరుగైన ఆధిక్యంలో కొనసాగింది. 12-7తో విరామ సమయానికి ముందంజలో నిలిచిన సింధు..ఆ తర్వాత మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. సింధుపై తిరుగులేని పైచేయి సాధించిన యమగూచి తొలి గేమ్‌ను 21-13తో గెల్చుకుంది. రెండో గేమ్‌ను యమగూచి మరింత దూకుడుతో సొంతం చేసుకుంది. 21-9తో సింధును ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ ఏడాది సింధుతో తలపడిన రెండు మ్యాచుల్లో అకానె యమగూచి సాధికారిక విజయాలు నమోదు చేసింది. మూడో సీడ్‌గా జకర్తాలో బరిలోకి దిగిన సింధు టైటిల్ వేటకు సెమీఫైనల్లో యమగూచి తెరదించింది.
పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌కు సైతం పరాభవం తప్పలేదు. మూడో సీడ్, డెన్మార్క్ షట్లర్ అండర్స్ ఆంటోన్సెన్ చేతిలో కిదాంబి శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. 41 నిమిషాల పాటు జరిగిన సెమీఫైనల్ పోరులో 14-21, 9-21తో ఫైనల్ బెర్త్‌ను ఆంటోన్సెన్కు కోల్పోయాడు. విరామం అనంతరం ఓ టోర్నీ సెమీస్‌కు చేరుకున్న మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ ఫైనల్‌కు చేరకుండానే నిష్క్రమించాడు.