Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐ కార్యదర్శి జై షా
చెన్నై : కరోనా మహమ్మారి ఐసీఎల్ విన్యాసాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని కోల్పోయిన క్రికెట్ ప్రియులకు శుభవార్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్‌ను భారత్‌లోనే నిర్వహిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నారు. చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌తో పాటు పాల్గొన్న జై షా అభిమానులకు తీపి కబురు చెప్పాడు. ' చెపాక్‌లో సూపర్‌కింగ్స్ ఆట చూసేందుకు మీరందరూ ఎదురు చూస్తున్నారని తెలుసు. ఆ సమయం ఎంతో దూరంలో లేదు. ఐపీఎల్ 15వ సీజన్ భారత్‌లోనే జరుగుతుంది. రెండు కొత్త జట్లతో ఐపీఎల్ మరింత ఆసక్తికరంగా ఉండనుంది' అని జై షా అన్నాడు.