Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్‌కత : భారత్, న్యూజిలాండ్ మూడో టీ20 మ్యాచ్ నేపథ్యంలో కోల్‌కత పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు. రెండేండ్ల విరామం అనంతరం కోల్‌కతకు అంతర్జాతీయ క్రికెట్ కళ రాగా.. మ్యాచ్‌ను సజావుగా నిర్వహించేందుకు 2000 మందికి పైగా పోలీసులను మొహరించారు. మ్యాచ్ టికెట్లను అధిక రేట్లకు అమ్ముతున్న 11 మందిని అదపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేశారు. ఆర్ఏఎఫ్, హెచ్ఆర్ఎఫ్ఎస్ సహా యాంటీ రౌండీ స్క్వాడ్ పోలీసులను సైతం స్టేడియం వద్ద మొహరించారు. డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ ర్యాంక్ అధికారులు మఫ్టీలో పర్యవేక్షించారు.