Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీఆర్పై 6-4తో ఘన విజయం
హైదరాబాద్ : 57వ నెహ్రూ సీనియర్ హాకీ టోర్నీలో ఒలింపియన్లతో కూడిన ఇండియన్ ఆయిల్ జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లో స్థానిక జట్టు సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్)పై 6-4తో తిరుగులేని విజయం సాధించిన ఇండియన్ ఆయిల్ గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచింది. ఒలింపియన్ వీఆర్ రఘునాథ్ నాలుగు పెనాల్టీ కార్నర్లతో మూడింటిని గోల్స్‌గా మలిచాడు. ఆట ఆరంభమైన 2వ నిమిషంలోనే రోషన్ ఫీల్డ్ గోల్‌తో ఇండియన్ ఆయిల్‌ను ఆధిక్యంలో నిలిపాడు. గ్రూప్-బిలో ఇండియన్ నేవిపై కాగ్ ఎలెవన్ 6-2తో ఘన విజయం సాధించింది. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో ఇండియన్ ఆయిల్‌తో ఇండియన్ నేవీ.. ఇండియన్ రైల్వేస్‌తో పంజాబ్ నేషనల్ బ్యాంక్ తలపడనున్నాయి.