Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్-ఏ జట్టుకు ఎంపిక
ముంబయి : భారత యువ పేస్ బౌలర్ దీపక్ చాహర్, యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యారు. న్యూజిలాండ్‌తో మూడో టీ20 మ్యాచ్ ముగిసిన అనంతరం నవంబర్ 23న జట్టును వీడనున్న ఇషాన్ కిషన్, దీపక్ చాహర్ దక్షిణాఫ్రికాకు బయల్దేరనున్నారు. సీనియర్ జట్టు పర్యటనకు ముందు భారత-ఏ జట్టు దక్షిణాఫ్రికాలో 3 నాలుగు రోజుల మ్యాచుల్లో ఆడనుంది. భారత-ఏ జట్టులో రైల్వేస్ వికెట్ కీపర్ ఉపేంద్ర యాదవ్ మినహా మరొకరు అందుబాటులో లేరు. ' దీపక్ చాహర్, ఇషాన్ కిషన్‌లు భారత-ఏ జట్టుకు ఎంపికయ్యారు. కోల్‌కతలో టీ20 ముగిసిన వెంటనే భారత-ఏ జట్టుతో కలిసి దక్షిణాఫ్రికాకు వెళ్లనున్నారు. సఫారీ పర్యటనలో భారత-ఏ జట్టుకు రెండో వికెట్ కీపర్ అవసరం. ఇషాన్ కిషన్ ఇప్పుడు సఫారీ టూర్లో ప్రథమ ప్రాధాన్య వికెట్ కీపర్ కానున్నాడు' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. చేతన్ శర్మ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ అవగాహన రాహిత్యంతో సఫారీ పర్యటనకు ఒకే వికెట్ కీపర్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. గుజరాత్ టాప్ ఆర్డర్ బ్యాటర్ ప్రియాంక్ పంచల్ భారత-ఏ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.