Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఐదుసార్లు విజేత, టైటిల్ ఫేవరేట్ ఇండియన్ ఆయిల్, అగ్ర జట్టు ఇండియన్ రైల్వేస్లు గూంచా 57వ నెహ్రూ సీనియర్ హాకీ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించాయి. అర్హత రౌండ్ నుంచి సెమీస్‌కు చేరుకున్న ఇండియన్ నేవీతో ఉత్కంఠ పోరులో ఇండియన్ ఆయిల్ షూటౌట్లో 4-2తో గెలుపొందింది. ఆట పూర్తయ్యే సరికి ఇరు జట్లు 2-2తో సమవుజ్జీగా నిలువటంతో విజేతను షూటౌట్లో తేల్చారు. మరో సెమీఫైనల్లో ఇండియన్ రైల్వేస్ అలవోక విజయం సాధించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌పై 4-0తో గోల్స్ వర్షం కురిపించి టైటిల్ పోరుకు చేరుకుంది. ఫైనల్లో ఓటమెరుగని ఇండియన్ ఆయిల్‌తో నేడు ఇండియన్ రైల్వేస్ టైటిల్ కోసం పోటీపడనుంది.