Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోచ్ వేటలో బజరంగ్ పూనియా
న్యూఢిల్లీ : భారత స్టార్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ పతక విజేత బజరంగ్ పూనియా కొత్త కోచ్ వేటలో నిమగమయ్యాడు. టోక్యో 2020 ఒలింపిక్స్ సన్నద్ధతలో భాగంగా విదేశీ కోచ్ షాకో బెంటిడిస్ వద్ద బజరంగ్ మూడేండ్ల పాటు శిక్షణ పొందాడు. భారత రెజ్లింగ్ సమాఖ్య సూచనల మేరకు బెంటిడిస్తో కోచింగ్ బంధానికి బజరంగ్ ముగింపు పలికాడు. 2024 పారిస్ ఒలింపిక్స్, 2022 ఆసియా క్రీడలను దృష్టిలో ఉంచుకుని బజరంగ్ ఇప్పుడు కొత్త కోచ్ అన్వేషణలో పడ్డాడు. ' నా కొత్త కోచ్ ఇంకా ఖరారు కాలేదు. తుది నిర్ణయం తీసుకోలేదు, ఇంకా చర్చలు నడుస్తున్నాయి. షాకాతో నాకు మంచి అనుబంధం ఉంది. కొత్త కోచ్ దగ్గర నూతన టెక్నిక్, కదలికలు నేర్చుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అని బజరంగ్ తెలిపాడు.