Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సెయింట్ మార్టిన కళాశాలలో రాష్ట్ర ఫుట్బాల్ రెఫరీల శిక్షణ తరగతులు బుధవారం ఆరంభమయ్యాయి. రాష్ట్ర సైక్లింగ్ సంఘం ఉపాధ్యక్షుడు మర్రి లక్ష్మణ్రెడ్డి ఈ ఐదు రోజుల సెమీనార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత క్రీడల్లో నిపుణులు పెరిగితే ఆ క్రీడతో పాటు క్రీడాకారులు కూడా అభివద్ధి చెందుతారని అన్నారు. ఆలిండియా ఫుట్బాల్, తెలంగాణ ఫుట్బాల్ సంఘం (టీఎఫ్ఏ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ శిక్షణ తరగతుల్లో 40 మంది రెఫరీలు పాల్గొన్నారు. రాష్ట్ర నుంచి జాతీయ స్థాయి రెఫరీలుగా మారే అవకాశం కలిపించేందుకు ఈ సెమీనార్ను నిర్వహిస్తున్నట్టు టీఎఫ్ఏ కార్యదర్శి ఫల్గుణ తెలిపారు.