Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్స్
హ్యూస్టన్ : భారత టేబుల్ టెన్నిస్ ఆటగాడు జి. సతియన్ ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్ మూడో రౌండ్లోకి చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో స్టార్ ఆటగాడు అచంట శరత్ కమల్‌కు ఎదురుదెబ్బ తగిలినా.. జి సతియన్ వరుసగా రెండో మ్యాచ్‌లో అలవోక విజయం సాధించాడు. వ్లాదిమిర్ సిడోరెంకో (రష్యా)పై 11-9, 11-9, 11-8, 11-6తో వరుస సెట్లలో 4-0తో గెలుపొందాడు. వరల్డ్ నం.37 సతియన్ నేడు మూడో రౌండ్ పోరులో వరల్డ్ నం.17 అరునా ఖాద్రి (నైజీరియా)తో తలపడనున్నాడు.