Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్
జకర్తా (ఇండోనేషియా) : భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, వరల్డ్ నం.7 పి.వి సింధు ఇండోనేషియా ఓపెన్‌లో దూసుకెళ్తోంది. మహిళల సింగిల్స్‌లో వరుసగా రెండో విజయంతో సింధు క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో మూడు గేముల మ్యాచ్‌లో చెమటోడ్చిన తెలుగు తేజం.. రెండో రౌండ్లో అలవోక విజయం నమోదు చేసింది. జర్మనీ షట్లర్ లియోనె లీపై 21-12, 21-18తో వరుస గేముల్లో గెలుపొందింది. 37 నిమిషాల్లో ముగిసిన ప్రీ క్వార్టర్స్ పోరులో సింధు తిరుగులేని ఆధిపత్యం చూపించింది. రెండు గేముల్లోనూ జర్మనీ అమ్మాయి సింధుకు పోటీ ఇవ్వటంలో విఫలమైంది. 9-4, 11-7తో విరామ సమయానికి ఆధిక్యంలో నిలిచిన సింధు ఆ తర్వాత వరుసగా ఐదు పాయింట్లు సాధించింది. 16-7, 20-10తో తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లో లియోనె పాయింట్లు సాధించినా.. ఎక్కడా పోటీ ఇవ్వలేదు. 7-3, 11-7తో ముందంజ వేసిన సింధు.. 15-11, 16-15, 19-17తో దూసుకెళ్లింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వని సులువుగా క్వార్టర్‌ఫైనల్ బెర్త్ సొంతం చేసుకుంది. పురుషుల డబుల్స్ సాత్విక్, చిరాగ్ శెట్టి జోరు మెరుపు విజయంతో క్వార్టర్స్‌కు చేరుకుంది. దక్షిణ కొరియా జోడీతో 75 నిమిషాల హోరాహోరీ మూడు గేముల మ్యాచ్‌లో 21-15, 19-21, 23-21తో సాత్విక్, చిరాగ్‌లు గెలుపొందారు.