Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ కీలక నిర్ణయం
హరారే : మహిళల ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ అర్హత టోర్నీపైనా కోవిడ్-19 కొత్త వేరియంట్ ఎఫెక్ట్ పడింది. ఆఫ్రికాలోని దక్షిణాది దేశాల్లో కోవిడ్-19 కొత్త రకం వైరస్ ఒమిక్రాన్ ప్రబలుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాది ప్రాంతంలో ప్రయాణ ఆంక్షలు విధించారు. జింబాబ్వేలో నిర్వహిస్తున్న మహిళల వన్డే వరల్డ్‌కప్ అర్హత టోర్నీని అర్థాంతరంగా రద్దు చేశారు. 2022 వన్డే వరల్డ్‌కప్ మార్చి-ఏప్రిల్‌లోనే నిర్వహించాల్సి ఉంది. దీంతో అర్హత టోర్నీ నిర్వహణకు సమయమే లేదు. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం బంగ్లాదేశ్, వెస్టిండీస్, పాకిస్థాన్‌లు వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. అర్హత టోర్నీలో జింబాబ్వే, బంగ్లాదేశ్‌లపై విజయాలు సాధించిన థారులాండ్‌కు ఐసీసీ ర్యాంకింగ్ లేకపోవటంతో ఆ జట్టు వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేదు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, భారత్‌లు ఇప్పటికే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి.