Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ వన్డే సిరీస్ రద్దు
జొహనెస్‌బర్గ్ : కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచ క్రికెట్‌పై పడగ విప్పుతోంది. ఆఫ్రికాలోని దక్షిణాది ప్రాంతాల్లో కోవిడ్-19 సరికొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. దీంతో దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో ఆంక్షలు, ప్రయాణాలపై నిషేధాలు విధిస్తున్నారు. ఈ ప్రభావం దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ వన్డే సిరీస్‌పైనా పడింది. వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో భాగంగా ఆడుతున్న ఈ సిరీస్‌లో తొలి వన్డే వర్షంతో రద్దు కాగా.. చివరి రెండు వన్డేలు కోవిడ్-19 కారణంగా వాయిదా పడ్డాయి. వన్డే సిరీస్ రద్దు అయినా, నెదర్లాండ్స్ జట్టు దక్షిణాఫ్రికాలోనే ఉండనుంది. స్వదేశానికి వెళ్లేందుకు ఆ జట్టుకు విమానం అందుబాటులో లేకపోవటంతో ఈ పరిస్థితి తలెత్తిందని సమాచారం. భారత్-ఏ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలోనే ఉండగా.. డిసెంబర్ ద్వితీయార్థంలో భారత జట్టు సఫారీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఒమిక్రాన్ విజృంభణతో టీమ్ ఇండియా అక్కడికి వెళ్లటంపై సందిగ్థత నెలకొంది.