Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్‌లో రచనొక్ చేతిలో ఓటమి
- ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్
జకర్తా : ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత పోరాటానికి తెరపడింది. మహిళల సింగిల్స్‌లో పి.వి సింధు, మెన్స్ డబుల్స్‌లో సాత్విక్ జోడీ టైటిల్ ఆశలు రేపారు. శనివారం జరిగిన సెమీఫైనల్ పోరులో రెండు విభాగాల్లోనూ భారత్‌కు ప్రతికూల ఫలితాలే వచ్చాయి. మహిళల సింగిల్స్‌లో వరల్డ్ చాంపియన్, వరల్డ్ నం.7 పి.వి సింధు మూడు గేముల పోరులో రెండో సీడ్ రచనొక్ ఇంటనాన్ (థారులాండ్) చేతిలో ఓటమి చెందింది. 15-21, 21-9, 21-14తో సింధుపై రచనొక్ అలవోక విజయమే నమోదు చేసింది. చివరి రెండు గేముల్లో సింధు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. మెన్స్ డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ 16-21, 18-21తో టాప్ సీడ్ మార్కస్, కెవిన్ (ఇండోనేషియా) జోడీ చేతిలో పరాజయం పాలయ్యారు.