Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్
కాన్పూర్ : శరీర రంగు కారణంగా జీవిత కాలం స్వదేశంలో సైతం వర్ణ వివక్ష చవిచూశానని భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ అన్నారు. ఇంగ్లాండ్ క్రికెట్లో జాతి వివక్ష దుమారం నేపథ్యంలో మాజీ లెగ్ స్పిన్నర్ తన వర్ణ వివక్ష అనుభవాలను బయటపెట్టాడు. 'నా జీవితాంతం రంగు కారణంగా వివక్షకు, విమర్శలకు గురయ్యాను. నిజానికి అదేమీ నన్ను బాధపెట్టదు. దురదృష్టశావతు ఈ చేదు అనుభవం నా స్వదేశంలోనే చోటు చేసుకుంది' అని శివరామకృష్ణన్ ట్వీట్ చేశాడు. తమిళనాడు క్రికెటర్ అభనవ్ ముకుంద్ సైతం 2017లోనే భారత క్రికెట్లో వర్ణ వివక్షపై గళమెత్తాడు. శివరామకృష్ణన్ భారత్కు 9 టెస్టులు, 16 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించాడు.