Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్: ఎఫ్1 జిపి అంబాసిడర్గా సౌదీ అరేబియాకు చెందిన రీమా జుఫాలీ నియమితులయ్యారు. సౌదీ అరేబియా తరఫున ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళా రేస్ డ్రైవర్ కూడా రీమానే కావడం విశేషం. ఈ వారంలోనే జెడ్డాV్ాలో తొలి ఫార్ములా వన్ గ్రాండ్ ఫ్రి జరగనున్నట్లు నిర్వాహకులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 29ఏళ్ల రీమా ఇటీవల బ్రిటీష్ ఫార్ములా-3 ఛాంపియన్షిప్లో పాల్గొన్నారు. ఈ పోటీలో ఆమె తొలి ప్రయత్నంలోనే ప్రారంభ రౌండ్లలో అగ్రస్థానంలో నిలిచింది. 2018 నుంచి రీమా సౌదీ అరేబియా తరఫున మహిళా రేసర్ లైసెన్స్ సంపాదించి పోటీల్లో పాల్గొంటోంది. ఈ పోటీల్లో 7సార్లు మెర్సిడెస్తోపాటు ప్రపంచ ఛాంపియన్ మ్యాక్స్ వెర్స్టాపెన్(రెడ్ బుల్స్)తోపాటు లెవిస్ హామిల్టన్కూడా ప్రాతినిధ్యం వహించనున్నారు.