Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలి: బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్‌కు భారత పురుషుల డబుల్స్ జోడీ అర్హత సాధించింది. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో ఉన్న చిరాగ్-సాత్విక్ జోడీ ఇటీవల ముగిసిన ఇండోనేషియా ఓపెన్‌లో సెమీఫైనల్‌కు అర్హత సాధించారు. ఆ టోర్నమెంట్లో జపాన్‌కు చెందిన అకిరా-టైచీ జోడీ కూడా సెమీస్‌లో ఓడింది. దీంతో భారత డబుల్స్ జోడీకి జాక్‌పాట్ దక్కింది. డిసెంబర్ 1 నుంచి బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ ప్రారంభం కానుంది. సాత్విక్-చిరాగ్ జోడీ సెమీస్‌లో టాప్‌సీడ్ మార్కస్-కెవిన్ల చేతిలో 16-21, 18-21తో ఓటమిపాలవ్వగా.. అకిరా-టైచీ జోడీ 22-20, 21-14తో జపాన్‌కే చెందిన టకూరో-యుగో చేతిలో ఓడారు. దీంతో భారత డబుల్స్ షట్లర్లకు అదృష్టం వరించింది. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ ఫైనల్‌కు చేరకపోవడంతో వారికి బెర్త్ దక్కలేదు.