Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టు డ్రా
- టీమిండియా విజయాన్ని అడ్డుకున్న రచిన్, అజాజ్
కాన్పూర్: చివరిబంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన కాన్పూర్ టెస్ట్ డ్రాగా ముగిసింది. టీమిండియా విజయాన్ని రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ అడ్డుకున్నారు. వీరిద్దరూ కలిసి చివరి వికెట్ పడకుండా దాదాపు 10 ఓవర్లపాటు భారత బౌలర్లకు ఇబ్బందులకు గురిచేశారు. దీంతో భారత జట్టు డ్రాతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. చివరిరోజు ఆట చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. చివర్లో విజయం భారత్‌వైపే మొగ్గినప్పటికీ కివీస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర(18), అజాజ్ పటేల్(2) భారత జట్టు విజయాన్ని అడ్డుకున్నారు. ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు వికెట్ నష్టానికి 4 పరుగులతో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ తొలుత నిలకడగానే ఆడినప్పటికీ ఆ తర్వాత మాత్రం వడివడిగా వికెట్లు కోల్పోయింది. అశ్విన్, రవీంద్ర జడేజా విజృంభణతో విజయం భారత్ వైపు మొగ్గింది. కివీస్ బ్యాటర్లలో టామ్ లాథమ్ 52, విలియమ్ సోమర్విల్లే 36, కెప్టెన్ విలియమ్సన్ 24, రచిన్ రవీంద్ర 18 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. భారత బౌలర్లలో జడేజాకు నాలుగు, అశ్విన్‌కు మూడు, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్‌కు తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు, ఆఖరి టెస్ట్ ముంబయి వేదికగా వాంఖడే స్టేడియంలో డిసెంబరు 3న ప్రారంభం కానుంది.
ఇండియా ఇన్నింగ్స్: 345, 234/7
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 296
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (బి)అశ్విన్ 52, యంగ్ (ఎల్బి) అశ్విన్ 2, సోమర్వెల్లె (సి)శుభ్‌మన్ (బి)ఉమేశ్ 36, విలియమ్సన్ (ఎల్బి) జడేజా 23, రాస్ టేలర్ (ఎల్బి) జడేజా 2, నికోల్స్ (ఎల్బి) అక్షర్ 1, బ్లండెల్ (బి)అశ్విన్ 2, రవీంద్ర (నాటౌట్) 18, జేమీసన్ (ఎల్బి) జడేజా 5, సౌథీ (ఎల్బి) జడేజా 4, అజాజ్ పటేల్ (నాటౌట్) 2, అదనం 17. (98 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) 165 పరుగులు.
వికెట్ల పతనం: 1/3, 2/79, 3/118, 4/125, 5/126, 6/128, 7/128, 8/147, 9/155
బౌలింగ్: అశ్విన్ 30-12-35-3, అక్షర్ పటేల్ 21-12-23-1, ఉమేశ్ 12-2-34-1, ఇషాంత్ 7-1-20-0, జడేజా 28-10-40-4