Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2022 వింటర్ ఒలింపిక్స్‌పై చైనా
బీజింగ్ : వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి 20 వరకు బీజింగ్ వేదికగా 2022 వింటర్ ఒలింపిక్స్‌కు చైనా సర్వం సిద్ధం చేసింది. ఈ సమయంలో ఒమిక్రాన్ కోవిడ్-19 కొత్త వేరియంట్ రూపంలో నిర్వాహకులు కొత్త సవాళ్లుఎదుర్కొంటున్నారు. ఒమిక్రాన్ నేపథ్యంలో వింటర్ ఒలింపిక్స్ నిర్వహణపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా కీలక ప్రకటన చేసింది. ' వైరస్ నివారణ, నియంత్రణ దిశగా ఒమిక్రాన్ పలు సవాళ్లు విసురుతుందని నమ్ముతున్నాం. కానీ వైరస్ నియంత్రణలో చైనాకు ఉన్న అనుభవం దృష్ట్యా వింటర్ ఒలింపిక్స్‌ను షెడ్యూల్ ప్రకారం సురక్షితంగా, సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తామని భావిస్తున్నాం' అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లిజియన్ తెలిపారు. చైనాలో 'జీరో-కోవిడ్' విధానం అమలు, మహమ్మారి కట్టడిలో కఠిన నిబంధనలు వింటర్ ఒలింపిక్స్ సజావుగా సాగేలా చేస్తాయని అభిప్రాయం వినిపిస్తోంది.