Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాడ్మింటన్ ప్రపంచ టూర్ ఫైనల్స్
బాలి (ఇండోనేషియా) : బ్యాడ్మింటన్ ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో భారత టైటిల్ వేటకు అగ్ర క్రీడాకారిణి పి.వి సింధు నాయకత్వం వహించనుంది. టాప్-8 షట్లర్లు పోటీపడే ప్రతిష్టాత్మక టోర్నీలో తొలిసారి భారత్ నాలుగు విభాగాల్లో బరిలోకి దిగుతోంది. మహిళల సింగిల్స్‌లో పి.వి సింధు, పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, లక్ష్మసేన్లు, మెన్స్ డబుల్స్‌లో చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ జోడీ, మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జంట పోటీపడుతున్నారు. గత మూడు టోర్నీల్లో సెమీఫైనల్స్‌కు చేరుకున్న వరల్డ్ చాంపియన్ సింధు సులువుగానే నాకౌట్‌కు చేరుకోనుంది. సింధు గ్రూప్‌లో లినె క్రిస్టోఫెర్సెన్ (డెన్మార్క్), యోవని లీ (జర్మనీ)లపై సింధుకు మంచి రికార్డుంది. ఓకే ఏడాదిలో నాలుగు సూపర్‌సిరీస్ టైటిళ్లతో చరిత్ర సృష్టించిన కిదాంబి శ్రీకాంత్, యువ సంచలనం లక్ష్యసేన్ సత్తా చాటేందుకు చూస్తున్నారు. తొలిసారి మెగా ఈవెంట్లో ఆడుతున్న డబుల్స్ జోడీలు సైతం స్థాయికి తగ్గ ప్రదర్శనతో మెరుగైన స్థానంతో ముగించాలని అనుకుంటున్నారు. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ నేటి నుంచి ఆరంభం.