Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడోసారి బల్లాన్ డీ అవార్డు సొంతం
పారిస్ : ప్రపంచ సాకర్ సూపర్‌స్టార్, అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ రికార్డు ఏడో బల్లాన్ డీ అవార్డును సొంతం చేసుకున్నాడు. వరుసగా నాలుగు మెగా ఫైనల్స్‌లో ఓటమి అనంతరం కోపా అమెరికా (2021) కప్‌ను అర్జెంటీనాకు అందించాడు మెస్సీ. అర్జెంటీనా తరఫున మెస్సీ సాధించిన అతిపెద్ద విజయం ఇదే. బార్సిలోనా తరఫున సైతం మెస్సీ అద్భుత ప్రదర్శన చేశాడు. 2021 బల్లాన్ డీ (గోల్డెన్ బాల్) విజేతగా అవతరించాడు. 2009, 2010, 2011, 2012, 2019, 2021 బల్లాన్ డీ అవార్డులను లియోనల్ మెస్సీ ఖాతాలో వేసుకున్నాడు. కోవిడ్ ప్రభావంతో 2020 బల్లాన్ డీ అవార్డును రద్దు చేశారు. మహిళల బల్లాన్ డీ అవార్డును బార్సిలోనా స్టార్ అలెక్సినా పుటెల్లాస్ సొంతం చేసుకుంది.
పచ్చి అబద్ధం! : ప్రతిష్టాత్మక బల్లాన్ డీ అవార్డులను అందించే ఫ్రాన్స్ ఫుట్‌బాల్ మ్యాగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్ పాస్కల్ ఫెర్రెపై ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో విరుచుకుపడ్డాడు. పారిస్‌లో 2021 బల్లాన్ డీ అవార్డుల ప్రదానం సందర్భంగా పాస్కల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'మెస్సీ కంటే ఎక్కువ బల్లాన్ డీ అవార్డులు సాధించటమే నా జీవిత లక్ష్యం' అని రొనాల్డో తనతో అన్నట్టు పాస్కల్ న్యూయార్క్ టైమ్స్ పత్రికతో చెప్పాడు. పాస్కల్ వ్యాఖ్యలపై రొనాల్డొ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. పాస్కల్ వ్యాఖ్యలు పచ్చి అబద్ధమని విరుచుకుపడ్డాడు. రొనాల్డో ఐదుసార్లు బల్లాన్ డీ అవార్డు విజేతగా నిలిచాడు.