Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫటోర్డా(గోవా): ఇండియన్ సూపర్‌లీగ్(ఐఎస్ఎల్)లో ముంబయి సిటీ జట్టు ఏటికే మోహన్ బగాన్‌ను చిత్తుచేసింది. బుధవారం జరిగిన లీగ్ పోటీలో ముంబయి సిటీ జట్టు తొలి అర్ధభాగానికే 5-0 గోల్స్ ఆధిక్యతను సంపాదించింది. ఆ తర్వాత ఏటికే జట్టు రెండో అర్ధభాగం మొదట్లో ఒక గోల్ కొట్టింది. ముంబయి తరఫున విక్రమ్ 4, 25ని.లో ఒక్కో గోల్ కొట్టగా. ఇగ్నోర్(38వ ని.), మౌర్టాడా (47వ ని.), బిపిన్ సింగ్(52వ ని.లో) ఒక్కో గోల్ కొట్టారు. ఇక ఏటికే తరఫున ఒక గోల్‌ను డేవిడ్ విలియమ్స్(60వ ని.లో) చేశాడు. ఆ తర్వాత ఇరుజట్లు మరో గోల్ కొట్టలేకపోయాయి. ఇక ఏటికేకు చెందిన దీపక్ తంగ్రీ తొలి అర్ధభాగంలోనే రెడ్‌కార్డ్‌కు గురవ్వడంతో ఆ జట్టు 10మంది ఆటగాళ్లతోనే మ్యాచ్‌ను ఆడాల్సి వచ్చింది.