Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్
హెల్వా(స్పెయిన్): బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ తొలిరౌండ్లో భారత షట్లర్ పివి సింధుకు బై లభించింది. డిఫెండింగ్ ఛాంపియన్ పివి సింధుతో బుధవారం తొలిరౌండ్లో తలపడాల్సిన ప్రత్యర్ధి షట్లర్ వైదొలగడంతో సింధు తొలిరౌండ్ మ్యాచ్ ఆడకుండానే రెండోరౌండ్లోకి ప్రవేశించింది. సింధు రెండోరౌండ్లో మార్టినా రెపిస్కా(స్లొవేనియా), రస్సెల్ హర్టవాన ్(ఇండోనేషియా) మ్యాచ్ విజేతతో తలపడనుంది. వీరిద్దరు కూడా సునాయాస ప్రత్యర్ధులే కావడంతో సింధు మూడోరౌండ్లోకి దూసుకెళ్లడం ఖాయం. ఈ క్రమంలో క్వార్టర్స్‌లో టాప్ సీడ్ తై-జు-యింగ్(చైనీస్ తైపీ) లేదా కరోలీనా మారిన్(స్పెయిన్)ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తైజుతో తలపడిన అన్ని మ్యాచుల్లోనూ సింధు ఓటమిపాలుకాగా.. 2016 రియో ఒలింపిక్స్ ఫైనల్లో మారిన్ చేతిలో సింధు ఓడింది. ఆ తర్వాత మారిన్ గాయాల బారిన పడి టోర్నీలకు దూరంగా ఉండి.. ఈ టోర్నమెంట్‌లోనే బరిలోకి దిగుతోంది. సుదీర్ఘ విరామం అనంతరం తైజు యింగ్ కూడా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రజిత పతకం సాధించిన అనంతరం తొలిసారి బరిలోకి దిగుతోంది. బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో ర్యాంకింగ్స్‌లో టాప్-8లో ఉన్న షట్లర్లు మాత్రమే బరిలోకి దిగుతారు.
ప్రపంచ ఛాంపియన్షిప్స్కు సైనా దూరం..
ప్రపంచ ఛాంపియన్షిప్స్ బ్యాడ్మింటన్ టోర్నీకి సైనా నెహ్వాల్ దూరమైంది. గాయం కారణంగా ఇటీవల జరిగిన టోర్నీలకు దూరమైన సైనా.. డిసెంబర్ మధ్యలో మళ్లీ రాకెట్ పట్టే సూచనలు కనబడుతున్నాయి. మణికట్టు గాయం తీవ్రత ఇంకా తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సైనా ట్విటర్ వేదికగా తెలిపింది. ప్రపంచ ఛాంపియన్స్ పోటీలు డిసెంబర్ 12-19న స్పెయిన్‌లోని హెల్వాలో జరగనున్నాయి.