Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వార్టర్స్‌లో పటిష్ట బెల్జియంపై గెలుపు
- ఎఫ్ఐహెచ్ జూ. ప్రపంచకప్ హాకీ సెమీస్‌కు భారత్
భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ జూనియర్ ప్రపంచ హాకీ టోర్నీలో యువ హాకీ ఆటగాళ్లు ఇరగదీశారు. బుధవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో పటిష్ట బెల్జియంపై 1-0తో గెలిచి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్నారు. చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో బెల్జియం దాడులను భారత రక్షణ శ్రేణి అద్భుతంగా అడ్డుకుంది. భారత్ తరఫున ఏకైక గోల్‌ను రెండో క్వార్టర్లో తివారి శార్దానందా 21వ ని.లో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. కెప్టెన్ వివేక్ సాగర్, 60వ ని.లో, యశ్దీప్ 52వ ని.లో ఎల్లోకార్డ్లకు గురయ్యారు. బుధవారం జరిగిన ఇతర క్వార్టర్‌ఫైనల్ పోటీల్లో అర్జెంటీనా జట్టు 2-1 తేడాతో నెదర్లాండ్స్‌ను, ఫ్రాన్స్ జట్టు 4-0తో మలేషియాను చిత్తుచేశాయి. ఇక జర్మనీ, స్పెయిన్ జట్ల మధ్య జరిగిన తొలి క్వార్టర్‌ఫైనల్ పోటీ 2-2తో డ్రా కాగా.. పెనాల్టీ షూటౌట్లో జర్మనీ జట్టు 3-1 తేడాతో స్పెయిన్‌ను చిత్తుచేసింది. షూటౌట్లో జర్మనీ తరఫున షట్రాఫ్, ముల్లర్, స్మిత్ గోల్స్ కొట్టగా.. పోల్జానిక్ నిరాశపరిచాడు. ఇక స్పెయిన్ తరఫున డీ-ఇగ్లోసియా, బాజో, ఫక్షర్టోనే నిరాశపర్చగా.. క్లేప్స్ మాత్రం గోల్ చేయగలిగాడు.
సెమీఫైనల్స్(3న)
ఫ్రాన్స్ × అర్జెంటీనా
జర్మనీ × ఇండియా