Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలోనే స్పష్టత ఇవ్వనున్న బీసీసీఐ
ముంబయి : కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం భారత్, దక్షిణాఫ్రికా ద్వైపాక్షిక సిరీస్పై పడింది. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు గణనీయంగా నమోదవుతున్నా సఫారీలో భారత్-ఏ జట్టు పర్యటన సజావుగా సాగుతోంది. న్యూజిలాండ్తో భారత్ రెండో టెస్టు డిసెంబర్ 7న ముగియనుంది. డిసెంబర్ 9న ప్రత్యేక విమానంలో భారత జట్టు దక్షిణాఫ్రికా బయల్దేరేందుకు షెడ్యూల్ రూపొందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యటన కొన్ని రోజులు వాయిదా వేయాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు తెలుస్తోంది. ' మనం ఇప్పుడు సాధారణ పరిస్థితుల్లో ఆడటం లేదు. ఓ పర్యటనకు ఎంతో ప్రణాళిక అవసరం. సఫారీ పర్యటన కోసం కొత్త బయో బబుల్లోకి రావాల్సిన ఆటగాళ్లు ఉన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనపై జట్టులో రాహుల్ ద్రవిడ్ ప్రస్తావించారు. త్వరలోనే సఫారీ పర్యటనపై కచ్చితమైన స్పష్టత రానుంది' అని కోహ్లి అన్నాడు.