Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్‌కత : కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావంతో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన పది రోజులు ఆలస్యంగా ఆరంభం కానుంది. డిసెంబర్ 17న తొలి టెస్టుతో సఫారీ పర్యటన ఆరంభం కావాల్సి ఉండగా.. తాజాగా డిసెంబర్ 26న బాక్సింగ్ డే టెస్టుతో టూర్ షురూ కానుంది. ఈ మేరకు శనివారం కోల్‌కతలో సమావేశమైన బీసీసీఐ ఏజీఎం తీర్మానించింది. సఫారీ పర్యటనలో భారత్ మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20లు ఆడనుంది. ఒరిజినల్ షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 9న ప్రత్యేక విమానంలో భారత జట్టు జొహనెస్బర్గ్కు బయల్దేరాల్సి ఉంది. పర్యటన షెడ్యూల్ మార్పుతో డిసెంబర్ 17 లేదా 18న భారత జట్టు దక్షిణాఫ్రికాకు వెళ్లనుంది. అంపైర్ల కమిటీ, దేశవాళీ ఎఫ్టీపీ కమిటీల ఏర్పాటుకు ఏజీఎం ఆమోదం తెలిపింది.