Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాడ్మింటన్ ప్రపంచ టూర్ ఫైనల్స్
బాలి : వరుసగా నాలుగు టోర్నీల్లో సెమీఫైనల్లోనే నిష్క్రమించిన పి.వి సింధు ప్రతిష్టాత్మక ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో సత్తా చాటింది. జపాన్ స్టార్ షట్లర్ అకానె యమగూచిపై 3 గేముల థ్రిల్లర్‌లో గెలుపొంది మహిళల సింగిల్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. 70 నిమిషాల హోరాహోరీ పోరులో సింధు 21-15, 15-21, 21-19తో గెలుపొందింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో 18-18 నుంచి సింధు అద్భుతంగా పాయింట్లు రాబట్టింది. నేడు టైటిల్ పోరులో కొరియా షట్లర్ సియోంగ్‌తో పోటీపడనుంది. కొరియా షట్లర్‌తో ముఖాముఖిలో సింధు 0-2తో వెనుకంజలో ఉంది. డెన్మార్క్ ఓపెన్ వరుస సీజన్లలో సింధుపై సియోంగ్ పైచేయి సాధించింది. మెగా ఈవెంట్లలో అదిరే ప్రదర్శన చేయటంలో దిట్టగా సింధుకు మంచి రికార్డుంది. నేటి ఫైనల్లోనూ తెలుగు తేజం ఆ తరహా ప్రదర్శనపై కన్నేసింది. మెన్స్ సింగిల్స్ సెమీస్‌లో లక్ష్యసేన్ వరుస గేముల్లోనే విక్టర్ అక్సెల్సెన్ చేతిలో ఓటమి చెందాడు. 21-13, 21-11తో లక్ష్యసేన్ ఫైనల్స్ బెర్త్‌ను కోల్పోయాడు.