Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలోనే బీసీసీఐ కమిటీ ఏర్పాటు
ముంబయి : ఐపీఎల్లో కొత్త ప్రాంఛైజీని దక్కించుకున్న సీవీసీ క్యాపిటల్స్‌కు లైన్ క్లియర్ అయినట్టే కనిపిస్తోంది. రూ.5625 కోట్లకు అహ్మదాబాద్ ప్రాంఛైజీని సీవీసీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. రూ.7090 కోట్లకు లక్నో ప్రాంఛైజీని ఆర్పీఎస్జీ గ్రూప్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీగా సీవీసీ క్యాపిటల్స్‌కు అంతర్జాతీయంగా కార్యాలయాలు ఉన్నాయి. యూరోప్‌లో బెట్టింగ్ చట్టబద్దం, అక్కడి బెట్టింగ్ కంపెనీల్లోనూ సీవీసీ క్యాపిటల్స్ పెట్టుబడులు పెట్టింది. దీంతో బెట్టింగ్ చట్టబద్దం కాని భారత్‌లో బెట్టింగ్ సంస్థలో పెట్టుబడులు పెట్టిన కంపెనీకి ఐపీఎల్ జట్టును ఎలా ఇస్తారనే ప్రశ్నలు లేవనెత్తారు. సీవీసీ క్యాపిటల్స్ సంస్థకు రెండు విభాగాలు ఉన్నాయి. ఒకటి యూరోప్ ఫండ్, రెండోది ఆసియా ఫండ్. బెట్టింగ్ సంస్థలో పెట్టుబడులు యూరోప్ ఫండ్ విభాగం నుంచి పెట్టగా.. ఐపీఎల్ నుంచి ఆసియా ఫండ్ విభాగం నుంచి కొనుగోలు చేశారు. బెట్టింగ్ సంస్థలతో ఆసియా ఫండ్ విభాగానికి ఎటువంటి సంబంధం లేదు. దీంతో ఐపీఎల్లో సీవీసీ క్యాపిటల్స్ ప్రాంఛైజీని కొనసాగించేందుకు బోర్డు సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.