Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్: క్రేజీ సౌదీ గ్రాండ్ ఫ్రి విజేతగా లెవీస్ హామిల్టన్ నిలిచాడు. ఆదివారం రాత్రి జరిగిన పోటీలో ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్ హామిల్టన్ అద్భుత ఆరంభాన్నిచ్చాడు. మెర్సిడెజ్ డ్రైవర్, రెడ్బుల్స్కు చెందిన మ్యాక్స్ వెర్స్టాపెన్ను ఓడించాడు. హామిల్టన్ కారు వెనుకభాగానికి డర్టీ డ్రైవర్ ఢకొీనడంతో హామిల్టన్ కారు నెమ్మదించింది. ఆ తర్వాత అసాధారణ రీతిలో పుంజుకున్న ఏడుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన హామిల్టన్ ఖాతాలో 369.5పాయింట్లు జమ అయ్యాయి. ఈ సీజన్ ఫైనల్ రౌండ్ వచ్చే వారం ఆఖర్లో అబుదాబిలో జరగనుంది. వెర్స్టాపెన్ రెండోస్థానంలో, వాల్టేరి బొట్టాస్(మెర్సిడెజ్) మూడోస్థానంలో నిలిచాడు.