Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-విదేశీ పిచ్‌లపై అజింక్యా వీరంగం
ముంబయి: గత ఏడాది కాలంగా టెస్టు జట్టులో టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ప్రదర్శన ప్రత్యేకంగా ఏమీ లేదు. 2021లో 12 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అతను ఆడిన మ్యాచుల్లో సగటు 19.75 మాత్రమే. అతని బ్యాట్‌తో ఒక్క సెంచరీ కూడా రాలేదు. అతను 411 పరుగులు మాత్రమే చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా టూర్లో రహానె టీమ్ఇండియాలో భాగమవుతాడా..? విదేశీ పిచ్‌లపై దుమ్ముదులిపిన అజింక్యాకు మరో ఛాన్స్ వస్తుందా..! అని క్రీడాభిమానుల్లో చర్చ. దక్షిణాఫ్రికాలో రహానే అద్భుత ప్రదర్శన రహానే దక్షిణాఫ్రికాలో మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అపుడు అతని బ్యాట్ నుంచి 266 పరుగులు వచ్చాయి. సగటు 53.20.యావరేజీగా నమోదైంది. మూడు టెస్టుల్లో అజింక్యా రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. అతని అత్యధిక స్కోరు 96 పరుగులు. ఓవరాల్‌గా దక్షిణాఫ్రికాపై రహానే ఆటతీరు చూస్తుంటే.. అది కూడా అద్భుతమే. దక్షిణాఫ్రికాతో జరిగిన 10 టెస్టు మ్యాచ్‌ల్లో 57.33 సగటుతో రహానే 748 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌ల్లో రహానే 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు సాధించాడు.
విదేశాల్లో దుమ్మురేపిన అజింక్యా
అజింక్య రహానే భారత గడ్డపై 32 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో.. అతను 35.73 సగటుతో 1644 పరుగులు చేశాడు. అలాగే విదేశీ పిచ్‌లపై ఇతని రికార్డు చూస్తే.. అద్భుతం. భారత్ వెలుపల ఆడిన 46 టెస్టు మ్యాచ్‌ల్లో రహానే 41.71 సగటుతో 3087 పరుగులు చేశాడు. భారత్‌లో రహానే కేవలం నాలుగు సెంచరీలు మాత్రమే బ్యాట్‌తో చేశాడు. అజింక్యా విదేశీ పిచ్‌లపై 8 సెంచరీలు సాధించాడు.
విదేశీ పిచ్‌లపై ఢిపెన్స్‌కు రహానె దూరం
దేశంలోని హౌమ్ గ్రౌండ్లు, పిచ్‌లపై టీమ్ ఇండియాలోని ఆటగాళ్లకు బాగా తెలుసు, అయితే విదేశాల్లోని వివిధ పిచ్‌లపై ఆటగాళ్లు.. అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్వింగ్, స్పీడ్ , బౌన్స్‌లకు ఆటగాళ్లు సిద్ధంగా ఉండాలి. అక్కడి పరిస్థితులకనుగుణంగా ఆటగాళ్లు ఆడాల్సి ఉంటుంది.