Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్స్కు డిఫెండింగ్ ఛాంపియన్, రెండుసార్లు టైటిల్ విజేత, టాప్‌సీడ్ కెంటో మొమొటో దూరమయ్యాడు. బుధవారం ట్విటర్ వేదికగా తాను త్వరలో ప్రారంభం కానున్న బిడబ్ల్యుఎఫ్ టోర్నీకి గాయం కారణంగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఇటీవల ముగిసిన హెచ్ఎస్బిఎస్ బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో బరిలోకి దిగిన జపాన్‌కు చెందిన మొమొటో తొలిరౌండ్ పోటీ తొలిసెట్ మధ్యలోనే వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇక మలేషియాకు చెందిన 7వ సీడ్ చెన్-పెంగ్ సూన్తోపాటు జో లి యంగ్ కూడా ఈ టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సోమ వారం తెలిపారు. దీంతో టోర్నీ రీ షెడ్యూల్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నిర్వాహకులు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.