Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మయాంక్ ర్యాంకింగ్ మెరుగు
- ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. ఆల్‌రౌం డర్, బౌలింగ్ జాబితాల్లో రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానానికి చేరుకోగా.. బ్యాటర్స్ జాబితాలో మయాంక్ అగర్వాల్ కెరీర్ బెస్ట్ పదకొండో స్థానానికి చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో అశ్విన్ (360పాయింట్లు) విండీస్ ఆటగాడు జాసన్ హోల్డర్(382) తొలి స్థానంలో ఉన్నాడు. రవీంద్రజడేజా(346) నాలుగో ర్యాంకుతో సరిపెట్టుకున్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ (348) మూడో స్థానంలో ఉన్నాడు. బౌలర్ల జాబితాలో పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) 908పాయింట్లు తొలి స్థానంలో ఉండగా.. రవిచంద్రన్ అశ్విన్(883) రెండో స్థానంలో ఉన్నాడు. కివీస్‌తో సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా (756) పదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. టెస్టు బ్యాటర్ల జాబితా టాప్-10లోకి డేవిడ్ వార్నర్(724), డికాక్(717) వచ్చారు. కివీస్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో సెంచరీ, అర్ధసెంచరీతో మెరిసిన మయాంక్ అగర్వాల్ (712) ఏకంగా 31 స్థానాలు ఎగబాకి పదకొండో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ(797) ఐదోస్థానం, విరాట్ కోహ్లీ(756) ఆరో స్థానంలో ఉన్నారు. తొలి నాలుగు స్థానాల్లో జోరు రూట్(903), స్టీవ్ స్మిత్(891), కేన్ విలియమ్సన్ (879) మార్నస్ లబుషేన్(878) నిలిచారు.