Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత పురుషుల క్రికెట్ జట్టును ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ బుధవారం ప్రకటించింది. టెస్ట్‌లకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లి, వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మలకు బాధ్యతలను అప్పగించింది. ఇప్పటివరకు టెస్టులకు వైస్ కెప్టెన్‌గా ఉన్న అజింక్యా రహానేకు ఆ బాధ్యతలనుంచి తప్పించి, ఉపసారథ్య పగ్గాలు రోహిత్ శర్మకు అప్పగించింది. సెలెక్షన్ కమిటీ ప్రకటించిన 18మంది సభ్యుల టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లి ఉండనున్నాడు. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీజ్లో విశ్రాంతి తీసుకున్న మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌లకు దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్ళే భారతజట్టులో చోటు దక్కగా.. శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలకు సెలెక్షన్ కమిటీ మొండిచెయ్యి చూపింది.
వన్డే కెప్టెన్‌గా రోహిత్..
వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగిస్తున్నట్లు ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. న్యూజిలాండ్‌తో భారత్ వేదికగా జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో 3-0తో క్లీన్ స్వీప్ చేయడం, ముంబయి ఇండియన్స్ జట్టు కెప్టెన్, భారత టీ20జట్టుకు కెప్టెన్‌గా ఉన్న అతని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని సెలెక్షన్ కమిటీ రోహిత్‌వైపు మొగ్గినట్లు తెలిసింది. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. జట్టు పగ్గాలు అందుకున్నందుకు గర్వంగా ఉందని, విరాట్ కోహ్లి, తాను కలిసి జట్టును విజయపథంలో నడిపేందుకు కృషిచేస్తామన్నాడు. ఈ సిరీస్‌కు టి20 పగ్గాలు కూడా రోహిత్‌కే దక్కాయి.
జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛటేశ్వర పుజరా, అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా, రిషబ్ పంత్(వికెట్ కీపర్లు), అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్
స్టాండ్‌బై: నవ్‌దీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, ఆర్జాన్ నాగ్వాస్వాల్ల.