Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 343/7
బ్రిస్బేన్ : యాషెస్ తొలి టెస్టులో ట్రావిశ్ హెడ్ (112 నాటౌట్, 95 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) గబ్బాలో ధనాధన్ మోత మోగించాడు. 85 బంతుల్లోనే శతకబాది యాషెస్ సిరీస్‌లో మూడో వేగవంతమైన సెంచరీ సాధించిన ట్రావిశ్ హెడ్ తొలి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియాను తిరుగులేని స్థానంలో నిలిపాడు. డెవిడ్ వార్నర్ (94, 176 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), మార్నస్ లబుషేన్ (74, 117 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో రెండో వికెట్‌కు 156 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మార్కస్ (3), స్మిత్ (12), కామెరూన్ గ్రీన్ (0), అలెక్స్ కేరీ (12), పాట్ కమిన్స్ (12) స్వల్ప స్కోరుకే వికెట్ కోల్పోయారు. తొలి రెండు సెషన్ల అనంతరం ఇంగ్లాండ్ సైతం రేసులో నిలిచినా.. మూడో సెషన్లో విధ్వంసక ఇన్నింగ్స్‌తో హెడ్ గబ్బాను ఆసీస్ చేతుల్లోకి తీసుకున్నాడు. అజేయ శతకంతో కదం తొక్కిన ట్రావిశ్ హెడ్ అప్పటికే ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్‌లో 196 పరుగుల భారీ ఆధిక్యం అందించాడు. నేడు చివరి మూడు వికెట్లకు మరో 50 పరుగులు జోడించినా.. గబ్బాలో కంగారూలకు ఇన్నింగ్స్ విజయం లాంఛనమే!. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 147 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే.
నో బాల్ రచ్చ : గబ్బా టెస్టులో నో బాల్ సాంకేతికత వివాదానికి దారితీసింది. ఇంగ్లాండ్ పేసర్ బెన్ స్టోక్స్ 14 నో బాల్స్ వేయగా.. అందులో ఒక్కసారి మాత్రమే నో బాల్‌గా గుర్తించారు. ఆ బంతికి వార్నర్ వికెట్ కోల్పోగా.. జీవనదానం లభించింది. అంపైర్ల నిర్లక్ష్యం, సాంకేతికత లోపంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు.