Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మహిళల క్రికెట్లో కెప్టెన్సీ చర్చ మొదలైంది. 2022 వన్డే వరల్డ్‌కప్ అనంతరం దిగ్గజం మిథాలీరాజ్ ఆటకు దూరమయ్యే అవకాశం ఉంది. మిథాలీ నిష్క్రమణతో వన్డే జట్టు కెప్టెన్సీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలనే చర్చలో స్మృతీ మంధాన ముందంజలో కొనసాగుతోంది. టీ20 కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కొనసాగుతున్నా.. భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా మంధానకు నాయకత్వ పగ్గాలు ఇవ్వాలని మాజీ కెప్టెన్ శాంత రంగస్వామి అన్నారు. ' మిథాలీ తర్వాత మంధాన మంచి చాయిస్. స్మృతీ అద్భుతంగా రాణిస్తోంది, భారత్‌ను నడిపించే అవకాశం సైతం ఆమెకు ఇవ్వాలి' అని శాంత వ్యాఖ్యానించింది. టీ20 కెప్టెన్సీ బాధ్యత హర్మన్‌ప్రీత్ బ్యాటింగ్‌పై ప్రభావం చూపిందని, మిథాలీ వారసురాలిగా మంధాననే చూడాలని అభిప్రాయపడింది.