Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీపై హైదరాబాద్ గెలుపు
మొహాలి : ఐపీఎల్ ఆటగాళ్ల మెగా వేలం ముంగిట హైదరాబాద్ యువ సంచలనం, 19 ఏండ్ల తిలక్ వర్మ (139, 123 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) శతకనాదంతో గర్జించాడు. ఐపీఎల్ ప్రాంఛైజీల ప్రతిభాన్వేషకులు, సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ చూస్తుండగా విజరు హజారే టోర్నీలో బలమైన ఢిల్లీ బౌలింగ్ విభాగాన్ని చిత్తు చేశాడు. 123 బంతుల్లో 139 పరుగుల శతక ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 7 ఫోర్లు, 8 సిక్సర్లతో విరుచుకుపడిన తిలక్ వర్మ.. చందన్ సహాని (87, 74 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లు)తో కలిసి 152 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. తిలక్ వర్మ, చందన్ జోరుతో తొలుత హైదరాబాద్ 325/6 పరుగుల భారీ స్కోరు చేసింది. సివి మిలింద్ (2/58), కార్తికేయ (2/28), త్యాగరాజన్ (3/33) రాణించటంతో ఛేదనలో ఢిల్లీ 246/9 పరుగులకే పరిమితమైంది. శిఖర్ ధావన్ (12), లలిత్ యాదవ్ (28) విఫలమయ్యారు. విజరు హజారే టోర్నీ గ్రూప్-సిలో వరుసగా రెండో విజయం నమోదు చేసిన హైదరాబాద్ తర్వాతి మ్యాచ్‌లో సౌరాష్ట్రతో ఆడనుంది.