Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియాకప్‌కు అండర్-19 జట్టును ప్రకటించిన బీసీసీఐ
ముంబయి: ఆసియాకప్ అండర్-19 కెప్టెన్‌గా ఢిల్లీ యువ బ్యాటర్ యశ్‌ధూల్ ఎంపికయ్యాడు. భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బీసీసీఐ) శుక్రవారం ప్రకటించిన 25మంది సభ్యుల బృందానికి ధూల్ సారథ్యం వహించనున్నాడు. యుఏఇ వేదికగా డిసెంబర్ 23నుంచి ఆసియాకప్ అండర్-19 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. బెంగళూరులో జరిగిన గవర్నింగ్ బాడీ సమావేశంలో జట్టు సభ్యుల జాబితాను ప్రకటించారు. 'ఆలిండియా జూనియర్ సెలెక్షన్ కమిటీ 20మంది సభ్యులను ఎంపిక చేయగా.. మరో ఐదుగురిని స్టాండ్‌బైగా పంపనున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. కెప్టెన్‌గా ఎంపికైన ధూల్ కు వినూ మన్కడ్ ట్రోఫీలో ఆడిన అనుభవముంది. అతడు ఆ టోర్నీలో ఢిల్లీ తరఫున 75.50 సగటుతో 302 పరుగులు చేశాడు. ఈ టోర్నమెంట్ అనంతరం జనవరి-ఫిబ్రవరిలో అండర్-19 ప్రపంచకప్ వెస్టిండీస్ వేదికగా జరగనుంది. ఈ టోర్నమెంట్లో రాణించిన ఆటగాళ్లకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కే అవకాశముండగా.. భారత అండర్-19 జట్టు ఆసియాకప్ టైటిల్‌ను ఇప్పటివరకు 6సార్లు ముద్దాడింది.
జట్టు: హర్నూర్ సింగ్ పన్ను, రఘువంశీ, గోశారు, రషీద్, యశ్ ధూల్్(కెప్టెన్), అనేశ్వర్ గౌతమ్, సిద్ధార్ద్ యాదవ్, కౌశల్ థంబే, నిషాంత్ సింధు, దినేశ్ బన, ఆరాధ్య యాదవ్(వికెట్ కీపర్లు), రజన్గడ్ బవ, రాజ్యవర్ధన్, సింఘ్వాన్, రవికుమార్, రిషిత్ రెడ్డి, మానవ్ ప్రకాశ్, అమృత్‌రాజ్, విక్కీ, వాసూ వాట్స్.
స్టాండ్‌బై: ఆయుశ్ సింగ్, ఉదరు శరణ్, షశ్వంత్ ధింగ్వాల్, ధనుశ్ గౌడ, పిఎం సింఫ్‌ు రాథోర్.