Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 425,
- ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 220/2
బ్రిస్బేన్: యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు పోరాడుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇనినంగ్స్లో 425పరుగులకు ఆలౌట్ కావడంతో ఆ జట్టు 278 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు శుక్రవారం మూడోరోజు ఆట నిలిచే సమయానికి 2 వికెట్ల నస్టానికి 220 పరుగులు చేసింది. ఆసీస్ కన్నా 58 పరుగులు వెనుకబడి ఉంది. ఓవర్ నైట్ స్కోర్ 7 వికెట్ల నష్టానికి 343 పరుగులతో శుక్రవారం ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 82 పరుగులు జతచేసి ఆలౌటైంది. హెడ్(152) వ్యక్తిగత స్కోర్వద్ద మార్క్ వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. స్టార్క్ 35 పరుగులు చేశాడు. అంతకుముందు ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్‌లో 147 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. రాబిన్సన్, మార్క్ వుడ్‌కు మూడేసి, వోక్స్‌కు రెండు, లీచ్, రూట్‌కు తలా ఒక వికెట్ దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు ఓపెనర్లు హమీద్(23), బర్న్స్(13) నిరాశపరిచినా.. మలన్(80), కెప్టెన్ రూట్(86) అజేయ అర్ధసెంచరీలతో మెరవడంతో ఇంగ్లండ్ కుదురుకుంది.
జో రూట్ రికార్డు
యాషెస్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ సారధి జోరూట్ రికార్డు బద్దలు కొట్టాడు. ఒక క్యాలెండర్ ఏడాదిలో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాదిలో రూట్ ఏకంగా 1541 పరుగులు చేశాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ సారధి మైకెల్ వాన్ పేరిట ఉండేది. 2002లో వాన్ 1481 రన్స్ చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును రూట్ బద్దలుకొట్టాడు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ - 147పరుగులు, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ - 425పరుగులు
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: హమీద్ (సి)క్యారీ (బి)స్టార్క్ 27, బర్న్స్ (సి)క్యారీ (బి)కమిన్స్ 13, మలన్ (బ్యాటింగ్) 86, అదనం 14. (70 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి) 220పరుగులు.
వికెట్ల పతనం: 1/23, 2/61
బౌలింగ్: స్టార్క్ 14-2-60-1, హేజిల్‌వుడ్ 8-4-13-0, కమిన్స్ 14-4-43-1, లియాన్ 24-4-69-0, గ్రీన్ 7-2-12-0, లబూషేన్ 4-0-14-0.