Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సౌరాష్ట్ర చేతిలో హైదరాబాద్ ఓటమి
మొహాలి : విజయ్ హజారే ట్రోఫీ ఎలైట్ గ్రూప్-సిలో వరుసగా రెండు విజయాలతో అదరగొట్టిన హైదరాబాద్.. మూడో మ్యాచ్‌లో తేలిపోయింది!. సౌరాష్ట్ర చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. రవితేజ (63, 86 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా.. తన్మరు అగర్వాల్ (1), అభిరాత్ (22), తిలక్ వర్మ (20), సుమంత్ (32), రాహుల్ (1), చందన్ (5) నిరాశపరచటంతో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 49 ఓవర్లలో 221 పరుగులకు కుప్పకూలింది. హర్విక్ దేశారు (101 నాటౌట్, 108 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), షెల్డన్ జాక్సన్ (65, 64 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్), ప్రేరక్ మన్కడ్ (49, 50 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించటంతో 39 ఓవర్లలోనే సౌరాష్ట్ర 225/3 పరుగులు సాధించింది. గ్రూప్-సిలో హ్యాట్రిక్ విజయాలతో సౌరాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది.