Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి టెస్టులో ఇంగ్లాండ్‌పై గెలుపు
బ్రిస్బేన్ : యాషెస్ సిరీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా ముందంజ వేసింది. గబ్బా టెస్టులో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన కంగారూలు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. జో రూట్ (89), డెవిడ్ మలాన్ (82) పోరాటంతో రెండోసారి బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియా స్వల్ప లక్ష్యాన్ని 5.1 ఓవర్లలో ఊదేసింది. అలెక్స్ కేరీ (9), మార్కస్ (9 నాటౌట్), లబుషేన్ (0 నాటౌట్)లు ఆస్ట్రేలియాకు అలవోక విజయాన్ని అందించారు. స్పిన్నర్ నాథన్ లయాన్ (4/91) ప్రదర్శనతో కెరీర్ 400 టెస్టు వికెట్ల క్లబ్లో అడుగుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్వితీయ 152 పరుగుల శతక ఇన్నింగ్స్ బాదిన ట్రావిశ్ హెడ్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. ఐదు టెస్టుల యాషెస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యం సాధించింది. రెండో టెస్టు ఆడిలైడ్ (డేనైట్)లో గురువారం నుంచి ఆరంభం కానుంది. ఇంగ్లాండ్ వరుసగా 147, 297 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేసింది. కెప్టెన్‌గా పాట్ కమిన్స్ తొలి టెస్టులోనే భారీ విజయం ఖాతాలో వేసుకున్నాడు.