Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నరెందర్ గౌడ్‌పై టీసీఏ ఆరోపణలు
హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) సభ్యుడు నరెందర్ గౌడ్ భారీగా నిధుల గోల్‌మాల్‌కు పాల్పడినట్టు తెలంగాణ క్రికెట్ సంఘం (టీసీఏ) కార్యదర్శి డి. గురువా రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. నరెందర్ గౌడ్ సమర్పించిన ఖర్చుల నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని గురువా రెడ్డి కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రాస్, ఎస్సీ సంక్షేమ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఎస్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినాలకు లేఖ రాశారు. బాలికల్లో క్రికెట్ నైపుణ్యాలు గుర్తించి, సానపట్టేందుకు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు కమ్మదనం, షాద్‌నగర్, చిలుకూరు, వనపర్తి, జిన్నారం సాంఘీక సంక్షేమ క్రికెట్ అకాడమీలు నడుపుతోంది. ఈ పేరిట నరెందర్ గౌడ్ సుమారు రూ.1.75 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని టీసీఏ ప్రధాన ఆరోపణ. 'నరెందర్ గౌడ్ రెండు ప్రయివేటు అకాడమీలు నడుపుతున్నాడు. ప్రభుత్వ నిధులను సొంత అకాడమీల అభివృద్దికి వాడుకుంటున్నాడు' అని గురువా రెడ్డి ఆరోపించారు.