Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓ పసిడి, మూడు రజతాలు సొంతం
న్యూఢిల్లీ : ఆసియా రోయింగ్ చాంపియన్‌షిప్స్ చివరి రోజు పోటీల్లో భారత రోయర్లు సత్తా చాటారు. సీనియర్ రోయర్ అరవింద్ సింగ్ పసిడి పతకం సొంతం చేసుకోగా..లైట్‌వెయిట్ మెన్స్ స్కల్స్ ఈవెంట్లో భారత రోయర్లు మూడు కాంస్య పతకాలు కొల్లగొట్టారు. చివరి రోజు మెరుపులతో భారత్ ఆరు పతకాలతో (రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు) చాంపియన్‌షిప్స్‌ను ఘనంగా ముగించింది. మెన్స్ లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌లో 11వ స్థానంలో నిలిచిన అరవింద్ సింగ్ ఆసియా దుమ్మురేపాడు. సింగిల్ స్కల్స్‌ను 7:55.942 సెకండ్లలో రేసును ముగించి స్వర్ణ పతకం సాధించాడు. లైట్‌వెయిట్ మెన్స్ డబుల్ స్కల్స్‌లో 7:12.568 సెకండ్లలో ముగించిన ఆశీష్ ఫోగల్ రజతం సాధించాడు. మెన్స్ క్వాడ్రపుల్ స్కల్స్ విభాగంలో బిట్టూ సింగ్, మంజీత్ కుమార్, జకర్ ఖాన్, సుఖ్మీత్ సింగ్‌లు 6:33.083 సెకండ్లలో పూర్తి చేసి రజతం సాధించారు. మెన్స్ ఫోర్ విభాగంలో జస్వీర్ సింగ్, పునీత్ కుమార్, గుర్మీత్ సింగ్, చరణ్‌జీత్ సింగ్‌లు 6:51.661 సెకండ్లతో సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నారు.