Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోషల్ మీడియాలో వైరల్
న్యూఢిల్లీ : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి విరాట్ కోహ్లి అభిమానుల సెగ తగిలింది. టెస్టు, వన్డే క్రికెట్లో నాయకత్వంపై పూర్తి ఫోకస్ చేసేందుకే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు విరాట్ కోహ్లి గతంలో రాసిన బహిరంగ లేఖలో స్పష్టంగా తెలిపాడు. అయినా, విరాట్ కోహ్లిపై ఏకపక్షంగా వేటు వేయటంపై అతడి అభిమానులతో పాటు క్రీడాభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌కు నాలుగేండ్లు వన్డే కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లి ఆ నాలుగు ఏడాదుల్లో ఐసీసీ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. భారత్‌కు వన్డేల్లో అత్యుత్తమ కెప్టెన్‌గా నిలిచినా వేటు వేయటంతో బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు గంగూలీ, షాలను తీసివేయాలని సోషల్ మీడియా వేదిక ట్విట్టర్లో హ్యాష్‌ట్యాగ్ వైరల్ చేశారు