Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెలక్షన్ రేసులో రుతురాజ్, అయ్యర్
- భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్
న్యూఢిల్లీ : భారత్ చివరగా ఆడిన వన్డే ద్వైపాక్షిక సిరీస్‌కు కెప్టెన్ అతడు. ఆ సిరీస్‌లో బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లతో విజయాన్ని అందించిన శిఖర్ ధావన్ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత వన్డే జట్టులో చోటు గల్లంతు చేసుకునే ప్రమాదంలో పడిపోయాడు. విజరు హజారే ట్రోఫీలో శిఖర్ ధావన్ పేలవ ప్రదర్శనతో జట్టులో అతడి చోటుపై అనుమానాలు మొదలయ్యాయి. ఎలైట్ గ్రూప్-సిలో వరుసగా 0, 12, 14, 18 స్కోర్లతో శిఖర్ ధావన్ విఫలమయ్యాడు. రహానె, ఇషాంత్ శర్మలు ఫామ్ కోల్పోయినా.. రాహుల్ ద్రవిడ్ హయాంలో చోటు నిలుపుకున్నారు. అదే తరహాలో సీనియర్ ఆటగాడు ధావన్‌కు సైతం ఓ అవకాశం లభించనుందనే అంచనా. ఇదే సమయంలో మహారాష్ట్ర తరఫున రుతురాజ్ గైక్వాడ్, మధ్యప్రదేశ్ తరఫున వెంకటేశ్ అయ్యర్లు వరుస శతకాలతో దుమ్మురేపుతున్నారు. దీంతో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్ ఎంపిక లాంఛనమే అనిపిస్తోంది. మధ్యప్రదేశ్‌పై 136, చత్తీగఢ్పై 154, కేరళపై 124 శతక ఇన్నింగ్స్‌లతో రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. 84 బంతుల్లో 112.. 49 బంతుల్లో 71.. 113 బంతుల్లో 151 పరుగులతో వెంకటేశ్ అయ్యర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. బంతితోనూ ప్రతి మ్యాచ్‌లో సత్తా చాటుతున్న వెంకటేశ్ అయ్యర్ వైట్‌బాల్ ఫార్మాట్లో హార్దిక్ పాండ్యను వెనక్కి నెట్టి జట్టులో చోటు సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన డిసెంబర్ 26న బాక్సింగ్ డే టెస్టుతో ఆరంభం కానుంది. వచ్చే ఏడాది జనవరిలో వన్డే సిరీస్ ఉండనుంది. వన్డే సిరీస్ కోసం సీనియర్ సెలక్షన్ కమిటీ త్వరలోనే జట్టును ఎంపిక చేయనుంది.