Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2024 ఒలింపిక్స్‌కు ఎఓసీ నిర్ణయం
న్యూఢిల్లీ : తెలంగాణ యువ షుటర్, వర్థమాన సంచలనం ఇషా సింగ్ ప్రతిష్టాత్మక టాప్స్ పథకానికి ఎంపికైంది. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) కింద 2024 పారిస్ ఒలింపిక్స్‌కు 148 మంది అథ్లెట్లను ఎంఓసీ ఎంపిక చేసింది. క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అధ్యక్షతన సోమవారం మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ) సమావేశమైంది. ఈ కమిటీలో ఏడుగురు మాజీ ఒలింపియన్లు సైతం ఉన్నారు. ఏడు ఒలింపిక్, ఆరు పారాలింపిక్ క్రీడాంశాల్లో 148 మంది అథ్లెట్లను ఎంపిక చేశారు. టాప్స్ కోర్ గ్రూప్, డెవలప్మెంట్ గ్రూప్ విభాగాల్లో రెండు కేటగీరీలుగా అథ్లెట్లను విభజించారు. షుటింగ్‌లో ఇషా సింగ్ డెవలప్మెంట్ విభాగం కింద టాప్స్ పథకానికి ఎంపికైంది. ఈ పథకం కింద ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు ప్రభుత్వం అందించనుంది. సైక్లింగ్, సెయిలింగ్, షుటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్‌లలో టాప్స్‌కు అథ్లెట్లను ఎంపిక చేశారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఈక్వెస్ట్రెయిన్, ఫెన్సింగ్, గోల్ఫ్, జిమ్నాస్టిక్స్, జుడో, రోయింగ్, టెన్నిస్ విభాగాల్లో టాప్స్‌కు అథ్లెట్లను తర్వాతి సమావేశంలో ఎంపిక చేయనున్నారు.