Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జార్ఖండ్ చేతిలో ఓడిన హైదరాబాద్
థానే: విజయ్ హజారే వన్డే టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ జట్టు మరో విజయాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన ఎలైట్ గ్రూప్-ఏలో ఆంధ్ర జట్టు 81 పరుగుల తేడాతో గుజరాత్‌ను చిత్తుచేసింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్, వికెట్ కీపర్ శిఖర్ భరత్(156) భారీ శతకానికి తోడు గిరినాథ్ రెడ్డి(34) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. తేజస్ పటేల్‌కు రెండు, చింతన్, హేమ్రాజ్, సిద్ధార్ధ్, చావ్లాకు తలా ఒక వికెట్ లభించాయి. ఛేదనలో గుజరాత్ జట్టు ఓపెనర్ కథన్ పటేల్(48) తృటిలో అర్ధసెంచరీని మిస్ చేసుకోగా.. ఉమాంగ్ కుమార్(55) అర్ధసెంచరీ చేశాడు. మనీశ్ గొలమారు(4/30), గిరినాథ్ రెడ్డి(2/48) బౌలింగ్‌లో మెరిసారు. దీంతో ఎలైట్ గ్రూప్-ఏలో ఆంధ్రజట్టు 5 మ్యాచుల్లో 12 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకింది.
హైదరాబాద్ హాట్రిక్ ఓటమి..
ఎలైట్ గ్రూప్-సిలో హైదరాబాద్ జట్టు వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. మంగళవారం జార్ఖండ్ చేతిలో హైదరాబాద్ 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. జార్ఖండ్ నిర్ణీత ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. మిలింద్(6/63) బౌలింగ్‌లో రాణించగా.. జార్ఖండ్ బ్యాటర్ విరాట్ సింగ్(65) బ్యాటింగ్‌లో మెరిసాడు. ఛేదనలో కెప్టెన్ తన్మరు అగర్వాల్(59), రాహుల్ బుద్ధి(45) రాణించినా.. మిగతా బ్యాటర్స్ నిరాశపరిచారు. వరుణ్ అరోన్(3/50), షాబాజ్ నదీమ్(3/32) బౌలింగ్‌లో మెరిసారు. ఈ ఓటమితో హైదరాబాద్ జట్టు గ్రూప్-బిలో 5 మ్యాచుల్లో 8 పాయింట్లతో నాల్గోస్థానానికి పడిపోయింది.